అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురష్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణుల రక్తదాన శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రక్తదాన కార్యక్రమం అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దాదాపు 175 నియోజకవర్గాలో పార్టీ శ్రేణులు చేపట్టిన రాక్తదానం 18 వేల యూనిట్లను దాటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బ్రద్ధలు కొట్టింది. గతంలో రక్తదానంలో 10,500 యూనిట్లుగా ఉన్న గిన్నిస్ రికార్డ్‌ను తుడిచిపెట్టింది. ప్రస్తుత ఈ రికార్డ్‌ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నమోదు చేసుకుంది.
అనకాపల్లి వాస్తవ నయనమ్ : ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్డులో గల వైయస్సార్ సిపి పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా శాసనసభ్యులు గుడివాడఅమర్నాథ్, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బిశెట్టి సత్యవతమ్మ , పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్, దాడి జైవీర్ గారు పాల్గొని ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.. అందులో భాగంగా అమర్నాథ్ నేరుగా అన్ని దానాలలో రక్తదానం మిన్న అని రక్త దానం చేయడం జరిగింది.అనంతరం విశాఖ పోర్టు స్టేడియంలో నేటి నుంచి జనవరి 9 వరకు నిర్వహించే వైయస్సార్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రగతి భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ కిట్ లను అందజేయడం జరిగింది అదే విధంగా అనకాపల్లి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి ప్రజల కోసం పనిచేసే నాయకులని ఆరోగ్యంగా ఉంటూ ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణు మూర్తి, డాక్టర్ శ్రీరామ్ మూర్తి, మండల పార్టీ అధ్యక్షులు గోర్లి సూరిబాబు, టౌన్ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామ రాజు, పలకా రవి, జాజుల రమేష్,కోరుకొండ రాఘవ,మళ్ళ బుల్లిబాబు, సూరిశెట్టి రమణ అప్పారావు, పి జగన్ మోహన్ రావు, బొడ్డేడ శివ, సకల గోవింద్, గైపూర్ రాజు, సాదుపుడి గణేష్, పెద్దడా రమశంకర్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు