లాక్ డౌన్ సమయంలో విద్యార్థులకు యాప్స్ ద్వారా సౌకర్యం

  • పోటీ పరీక్షలకు క్విజిస్ వి2020,మాథ్స్ ట్రిక్స్,మాథ్స్ లెర్న్ : బ్రెయిన్ ఛాలెంజ్ పేరట యాప్

  • ఆదర్శంగా నిలిచిన కళ్ళకురి స్వరూప్


కరోనా కష్టకాలంలో చదువులకు సాంకేతికత దోహదపడుతోంది. ఇన్నాళ్లూ అభ్యసనకు దూరమైన 1,2,3 తరగతులు విద్యార్థులకు ఉపయోగపడే మథమేటిక్స్ బ్రెయిన్ చాలెంజ్ యాప్స్,పోటీ పరీక్షలకు ఉపయోగపడే యాప్స్  క్రియేట్ చేసిన హైదరాబాద్ వాసి కళ్ళకురి స్వరూప్ కు తెలుగు రాష్ట్రాల్లో విశేష స్పందన లభించింది. 


హైదరాబాద్/అమరావతి : జూన్‌ నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాల్సి ఉండగా కరోనా మహమ్మారితో నేటికీ తెరవలేని దుస్థితి. ప్రభుత్వం సెప్టెంబరు 21న విద్యాసంస్థలను ప్రారంభించాలని నిర్ణయించినా అప్పుడైనా తెరుస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకం. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా వాల మేధస్సు మేధస్సు పదును పెట్టేలాగా యాప్స్ ఉంటటం  ఆన్‌లైన్‌ లో ఇంటి దగ్గరే ఉండి ఇటువంటి మంచి అవకాశం చిన్నపిల్లలకు లభించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా  మిడిల్ క్లాస్ పిల్లలు ఫ్రీ యాప్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి.


చదివే విద్యార్థుల్లో చాలామంది పేద విద్యార్థులే. వారిలో ఎక్కువ శాతం గ్రామీణులే! వారిలో కొంతమందికి ఆండ్రాయిడ్‌ ఫోన్లు లేవు. అలాంటి వారు సమీపంలోని స్నేహితుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆన్‌లైన్‌ యాప్స్ సద్వినియోగం చేసుకుంటున్నామని విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పడంతో స్వరూప్ లో మరింత ఉత్సాహం నింపింది. ఫోన్లు లేని వారు స్నేహితులు, సమీపంలోని విద్యార్థుల చెంతకు వెళ్లి సద్వినియోగం చేసుకుంటున్నారు అంటే ఆ యాప్స్ కు ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతుంది. కష్టకాలంలోనూ విద్యార్థులు విజ్ఞానంతో పాటు సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఇటువంటి  యాప్స్ భవిష్యత్తులో ఉపయోగమే అంటున్నారు.గూగుల్ ప్లై స్టార్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఈ యాప్స్ ఎటువంటి రూపాయి చెల్లించాల్సిన అవసరం అంటున్నాడు స్వరూప్. పత్రికా విలేఖరులతో స్వరూప్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక దశలో లాక్ డౌన్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఆలోచనతో యాప్స్ తయారు చేసి ప్లై స్టోర్ లో పెట్టడం జరిగింది. త్వరలోనే మరిన్ని యాప్స్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తయారు చేస్తానని చెప్పారు.



త్వరలోనే మరో అనుబంధ సంస్థ తో vmeet.ai అనే పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాండ్విడ్త్ మేనేజ్మెంట్ యాప్ ని తయారు చేశాం అన్నారు. అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగపడే తమ సంస్థ ధ్యేయమన్నారు. కొద్దిరోజుల్లోనే ప్రజల ముందుకు ఈ యాప్ ని తీసుకొస్తామన్నారు. తద్వారా ప్రజలకు ఉపయోగపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.