వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్
-విశాఖను అమ్మకానికి పెట్టేద్దామా.. అని చూసిన చరిత్ర చంద్రబాబుది
- బాబు సమ్మిట్ల ద్వారా తెచ్చానంటున్న 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయో వెతికి పెట్టండి
- ఉత్తరాంధ్రకు ఎవరి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధం..
- కరోనాతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తుంటే.. చంద్రబాబు మాత్రం స్టేట్ డిస్టెన్స్ పాటిస్తున్నాడు
- అమరావతి రాజధాని అన్నది దేశంలోనే అతి పెద్ద స్కాం
- మైసూర్ బోండా తరహాలో అమరావతిలో.. బాబు కట్టిన రాజధాని కనిపించదు
-విశాఖను సమ్మిట్లకు మాత్రమే చంద్రబాబు వాడుకున్నారు. సంపదను, వనరులన్నీ దోచేశారు
-బాబు అమ్మోనియం నిల్వల గురించి మాట్లాడుతుంటే... ఏ కుట్రకు ప్లాన్ చేశాడో అన్న భయమేస్తుంది
-2015లో లక్షల ఎకరాల్లో భూ స్కాంలు, రికార్డు ట్యాంపరింగ్ లు జరిగింది మరచిపోయారా బాబూ..
- మేం మూడు ప్రాంతాలూ బాగుండాలని అంటుంటే.. బాబు అమరావతి ఒక్కటే బాగుండాలంటున్నాడు
- తండ్రి జూమ్ లో... కొడుకు ట్విట్టర్ లో.. టీడీపీ జూమ్, ట్విట్టర్ పార్టీగా మారింది
- యూజ్ అండ్ త్రో పొలిటీషియన్ చంద్రబాబు..ఖర్జూరనాయుడు వారసుడినని ఎప్పుడైనా చెప్పారా
- విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తూ.. ఈ ప్రాంతంపై చంద్రబాబు విషం కక్కుతున్నారు
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
1. విశాఖపట్నం.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచీ వచ్చే వారినీ, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలకు ఆత్మీయత పంచి, అందర్నీ ఆదరించే నగరం. అటువంటి విశాఖ నగరం బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడు.
2. ఒక బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతున్న విశాఖ నగరాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తే... వెనుకబడిన ఉత్తరాంధ్రకు గుర్తింపు తెచ్చి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే... టీడీపీ, చంద్రబాబు ఎందుకు మోకాలడ్డాలని ప్రయత్నిస్తున్నారు. విశాఖపై వీళ్ళంతా ఎందుకు విషం చిమ్ముతున్నారు..?
3. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో సుమారు 22 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఈ 22 ఏళ్ళలో మీరు విశాఖపట్నంకు చేసిందేమిటో చెప్పండి. శాశ్వతంగా చెప్పుకునేందుకు ఫలానా అభివృద్ధి కార్యక్రమం చేశామని ఒక్కటంటే ఒక్కటైనా చూపించండి..?
- చంద్రబాబు నాయుడు కూడా 14 ఏళ్ళు ముఖ్యమత్రిగా ఉండి.. ఉత్తరాంధ్రకు ఏం చేశారు.. ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటి..?
- అప్పుడెప్పుడో విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించానని, విశాఖకు ఏదో చేశానని మాట్లాడుతున్న చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను.
- టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి ఏమిటి..? వైయస్ఆర్ గారు, జగన్ మోహన్ రెడ్డిగారి పాలనలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు మేం సిద్ధం. మీరు ఎక్కువ చేశాం ..అని నిరూపించగలిగితే, నా పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం...ఛాలెంజ్.
4. 2014లో రాష్ట్ర విభజన జరిగితే.. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమించి.. ఆ కమిటీ తమ అభిప్రాయాలు వెల్లడిస్తే.. చంద్రబాబు నాయుడు ఏం చేశారు.. ఆకమిటీ సిఫార్సులు చెత్తబుట్టలో పడేసి... ఆయన సామాజికవర్గం కోసం, ఆయన బినామీల భూముల రేట్లు కోసం.. ఆయనకు కావాల్సిన ప్రాంతంలో అమరావతి రాజధానిని ఏర్పాటు చేశారు.
5. అమరావతిలో గొప్ప సంపద సృష్టించానని చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నాడు. ఈ సంపదను ఇప్పుడేదో విశాఖపట్నంకు తరలింపు చేస్తున్నారంటున్నారు. అసలు అమరావతి రాజధాని.. దేశంలోనే అతి పెద్ద స్కాం.
6. విజయవాడ దాటి.. గుంటూరు మీదుగా వెళుతుంటే.. నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో ఒక పంట, అసలు పంట కూడా పండని భూములు ఉన్నాయి. పంట పండని భూముల్ని మాత్రం చంద్రబాబు గ్రీన్ జోన్ లో పెట్టాడు. అమరావతి రాజధానిలోని తుళ్లూరు, మందడం ప్రాంతాలను మాత్రం నాన్ అగ్రికల్చర్ జోన్ గా పెట్టాడు. ఇది నిజం కాదా..?
- ఇది రియల్ ఎస్టేట్ కాదా.. ఇది వ్యాపారం కాదా.. ఇది స్కాం కాదా..?
7. అమరావతిని అంతర్జాతీయ నగరంగా, గొప్ప రాజధానిగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు చెప్పారు. అంత అభివృద్ధి చేస్తే.. మరి మీరు ఎందుకు అమరావతి ప్రాంతంలో ఓడిపోయారో ఇంతవరకూ సమధానం చెప్పలేదు. మీ పార్టీకి జాతీయ జనరల్ సెక్రటరీగా ఉన్న మీ పుత్రుడు లోకేష్ అక్కడ ఎందుకు ఓడిపోయారో సమాధానం చెప్పండి.
8. మైసూరు బోండాలో మైసూరు లేనట్టే.. అమరావతిలో.. చంద్రబాబు కట్టిన రాజధాని కనిపించదు. మీరు చూపించిన గ్రాఫిక్సే ఇప్పటికీ మీకు సంబంధించిన టీవీ ఛానళ్ళలో చూపిస్తున్నారు.
9. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా ఉండి.. హైదరాబాద్ లో కూర్చుని ఉదయాన్నే జూమ్ లోకి రావడం.. ఒక ఆరోపణ చేయడం.. ప్రభుత్వంపై బురదచల్లటం చేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అంటూ.. ఉదయం లేచిన వెంటనే పెద్ద ఆరోపణ చేస్తారు. ఆధారం ఇవ్వమంటే.. ఒక్క ఆధారం కూడా చూపించలేకపోతున్నారు.
- అదే మేం కూడా.. చంద్రబాబు పది హత్యలు.. లోకేష్ పది రేప్ లు చేశాడని అంటే.. మీరు ఒప్పుకుంటారా...?
10. చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖలో ఉన్న హిందుస్థాన్ షిప్ యార్డ్ ను, హెచ్ సీఎల్.. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేద్దామని చూడలేదా..?
- విశాఖను ఎప్పుడు అమ్మకానికి పెట్టేద్దామా.. అని చూసిన చరిత్ర చంద్రబాబుది.
- విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటంతోపాటు, దానిని విస్తరించి, హిందుస్థాన్ షిప్ యార్డును కాపాడింది వైయస్ రాజశేఖరరెడ్డిగారు.. ఈరోజు జగన్ గారి నాయకత్వంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయబోతున్నాం.
11. విశాఖపట్నంను చంద్రబాబు నాయుడు సమ్మిట్లకు మాత్రమే వాడుకున్నాడు.. ఇక్కడ వనరుల్ని దోచేశాడు.. ఇక్కడ సంపదను అమ్మకానికి పెట్టాడు.
- మాట్లాడితే విశాఖలో పార్టనర్ షిప్ సమ్మిట్లు పెట్టాను... రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 43 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు.
- చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన 20 లక్షల కోట్లు పెట్టుబడులు.. 40 లక్షల ఉద్యోగాలు ఎక్కడా కనపడటం లేదు.. దయచేసి వెతికి పెట్టండి.. అని కంప్లైంట్ ఇద్దామనుకున్నాను. ఇవన్నీ చంద్రబాబుకు మాత్రమే కనిపిస్తాయోమో, మరి.
- ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని తెలిసి, కంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచనను విరమించుకున్నాను.
12. విశాఖ రైల్వే జోన్ కోసం ఈ ప్రాంత ప్రజలంతా పోరాడుతుంటే.. టీడీపీ నేతలు పైకి ప్రకటనలు చేస్తూనే, విశాఖ హుద్ హుద్ తుఫాను వస్తే మునిగిపోతుంది.. నగరం కొట్టుకుపోతుందని.. టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావులతో కేంద్రానికి లేఖలు రాయించింది చంద్రబాబు కాదా..
13. విశాఖలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం, ఆయన గత చరిత్ర తెలిసిన వ్యక్తిగా.. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈయనే ప్రమాదానికి గురి చేసి.. విధ్వంసాలు సృష్టించి.. విశాఖపై తన పగను చూపించుకోవాలనుకుంటున్నాడు. విశాఖను ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళతాడోనన్న ఈ ప్రాంత వాసులుగా మాకు భయం కలుగుతుంది.
14. చంద్రబాబు నాయుడు నీతి, నిజాయితీ లేని వ్యక్తి. ఆయన ఎప్పుడూ తన తండ్రి ఖర్జూరనాయుడు వారసుడ్ని అని ఏరోజూ చెప్పలేదు. తాను వెన్నుపోటు పొడిచిన ఎన్టీఆర్ వారసుడు అని మాత్రమే చెబుతాడు. తన తల్లి చివరి క్షణాల్లో ఉంటే కనీసం చూడని వ్యక్తి చంద్రబాబు. ఆఖరికి తన తల్లిని కూడా ఆర్థిక అవసరాల కోసం.. లోకేష్ గిఫ్ట్ డీడ్ కోసం వాడుకున్నాడు.
- చంద్రబాబు అంటేనే యూజ్ అండ్ త్రో పొలిటీషియన్. ఇలా ఎంతోమందిని తన అవసరాల కోసం వాడుకుని.. డస్ట్ బిన్ లో పడేశాడు.
- ఈ ప్రాంతంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను కోరుతున్నాను. చంద్రబాబు ఉచ్చులో పడి.. ఆయన డస్ట్ బిన్ లోకి వెళ్ళొద్దని కోరుతున్నాను.
- ఇదేవిధంగా మాట్లాడి.. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణకు చెందిన నాయకులు ఏమైపోయారో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.
15. ఇక విశాఖలో భూ కుంభకోణాలు.. అని చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే.. 2015లో విశాఖలో వెలుగుచూసిన భూ స్కాంలు , ల్యాండ్ ట్యాంపరింగ్ లు.. మీకు చెందిన పత్రికల్లోనే, మీ గెజిట్ పత్రికల్లోనే పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. 4 లక్షల ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డులు ట్యాంపరింగ్ జరిగాయని.. ల్యాండ్ స్కాంలకు సంబంధించిన అనేక కథనాలు వచ్చాయి. వాటి గురించి మరచిపోయారా చంద్రబాబూ..
- గురివింద గింజ చందాన.. మీరు విశాఖలో స్కాంల గురించి మాట్లాడితే... ఆశ్చర్యం కలిగింది. పగవాడు పందిరేస్తే..ఎలా ఉంటుందో విశాఖ మీద చంద్రబాబుకు ప్రేమ అలాగే ఉంటుంది.
16. అమరావతిలో చంద్రబాబు ఏం చేశాడు. రాజధాని పేరుతో ఇడ్లీ పాత్ర డిజైన్లు.. ఈఫిల్ టవర్.. ఐకానిక్ బ్రిడ్జి.. అంటూ ఆయన చెప్పినవన్నీ ఇప్పటికీ గ్రాఫిక్స్ లోనే ఉండిపోయాయి.
- మీరు రాజధాని కట్టారని, అమరావతిలో రాజధాని ఉందని ఇంకా ఊహల్లోనే చంద్రబాబు బతుకుతున్నారు.
- మేం మాత్రం.. అమరావతిని శాసన రాజధానిగా.. కర్నూలును జ్యుడీషియల్ రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు మాత్రం అమరావతిలో తప్ప, ఎక్కడా ఏమీ ఉండకూడదని మాట్లాడుతున్నారు. మీరు అసలు నాయకులా..?
17. కరోనా టెస్టుల విషయంలోగానీ, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల విషయంలోగానీ.. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలబడింది.
- కరోనాకు భయపడిపోయి.. సోషల్ డిస్టెన్స్ పాటించమంటే.. చంద్రబాబు ఏకంగా స్టేట్ డిస్టెన్స్ నే పాటిస్తున్నాడు. ఇప్పుడు ఇతర రాష్ట్రంలో తలదాచుకుంటున్నట్లే.. భవిష్యత్తులో సింగపూర్, మలేషియాల్లో దాచుకున్న డబ్బుల కోసం, ఆస్తుల కోసం ఇంటర్నేషనల్ స్థాయికి బాబు పారిపోయి, ఆ స్థాయిలో సోషల్ డిస్టెన్స్ పాటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
18. చంద్రబాబేమో జూమ్ లోనే కనిపిస్తారు. కొడుకు లోకేషేమో ట్విట్టర్ లోనే కనిపిస్తారు. వీళ్ళు ఇక టీడీపీని జూమ్ పార్టీగా, ట్విట్టర్ పార్టీగా మార్చేసుకుంటే మేలు.
19. రఘురామకృష్ణరాజు విమర్శలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. జబర్దస్త్ కామెడీ షో చూసినట్లే.. ఆయన రోజూ పెట్టే మీడియా సమావేశాలు ఉన్నాయి.. ఆయన ఒక తేడా క్యాండిడేట్.. అని ఎప్పుడో చెప్పాం.