అనకాపల్లి వాస్తవ నయనమ్ : స్థానిక వేల్పుల వీధిలో ఉగ్గీన అప్పారావు,బోండా శంకర్ రావు ఆధ్వర్యంలో వైయస్సార్ చేయూత లబ్ధిదారులు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ ఫ్లెక్సీ లకు పాలాభిషేకం చేశారు.45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కాచెల్లెళ్లకు చేయూతనిచ్చే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నారని ఉగ్గీన అప్పారావు తెలిపారు.18750 చొప్పున నాలుగేళ్లలో 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అక్క చెల్లెమ్మలకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ పార్టీ అధ్యక్షులుగా జానకి రామ రాజు, యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ చేతుల మీదుగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోండా వాసు,కొంకి శ్రీరామ్ మూర్తి, నూకరాజు, శీను, బుచ్చిరాజు, దేవుళ్ళు, వై ఎస్ ఆర్ సి పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వైయస్సార్ చేయూత లబ్ధిదారులుచే సీఎం జగన్,ఎమ్మెల్యే అమర్ ప్లెక్సీలకు పాలాభిషేకం