కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న రష్యా

  • పునీత్ కుమార్తెకు కోవిడ్ టీకా

  • టీకా తయారీని ధృవీకరించిన రష్యా అధ్యక్షుడు


మాస్కో : కరోనా వణికిస్తున్న వేళ కొనసాగుతున్న టీకా రేసును ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచానికి తొలి ఆశాకిరణం కనిపించింది. కరోనా వైరస్ పై రష్యా తొలి వ్యాక్సిన్ విడుదల చేసింది.ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన చేశారు.తన కుమార్తె వేయించుకున్నట్లు వెల్లడించారు. దీంతో కరోనా వ్యాక్సిన్ ను రిజిస్ట్రేషన్ తొలి దేశంగా అవతరించింది. టీకా ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్ నియంత్రణలో కి వస్తుందని తెలిపిన పునీత్ తొలుత వైద్య సిబ్బంది కి, ఉపాధ్యాయులకు ఈ టీకా ఇవ్వనున్నట్లు గా తెలిపారు.'కరోనా వైరస్ పై టీకా అభివృద్ధి చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది' అని అధ్యక్షుడు ప్రకటించారు. ఈరోజు ఆయన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన వెల్లడించారు.ఈ టీకా సంభందించిన సమాచారాన్ని తనుకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని ఆయన దేశ ఆరోగ్య శాఖ మంత్రి కి ఆదేశించారు.