ఫేస్‌బుక్‌తో కలిసిన రిలయన్స్ రిటైల్.. వాట్సాప్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా జియో మార్ట్ సేవలను ప్రారంభించింది. రెండు దిగ్గజ సంస్థల మధ్య భారీ లావాదేవీ జరిగిన మూడు రోజుల్లోనే జియోమార్ట్ సేవలను వాట్సప్‌లో అందుబాటులోకి తీసుకురావడం విశేషం. కాకపోతే, ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద కేవలం ముంబయిలోని నేవీ ముంబయి, థానే, కల్యాణ్ వంటి ప్రాంతాల్లోనే ఈ సేవలు లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం క్యాష్ ఆర్డర్లు మాత్రమే అనుమతిస్తున్నారు. కాగా జియోమార్ట్ సేవలను ఉపయోగించేందుకు గాను వినియోగదారులు +91 88500 08000 అనే నంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అనంతరం వాట్సాప్‌లో ఆ నంబర్‌కు Hi అని మెసేజ్ పంపితే లింక్ వస్తుంది. లింక్‌పై క్లిక్ చేశాక..వచ్చే వెబ్ పేజీలో డిటేల్స్ నమోదు చేయాలి. ఆటోమేటిక్ రెస్పాన్స్ మెసేజ్ సిస్టం ద్వారా వినియోగదారులు తమకు కావల్సిన సరుకులను ఆర్డర్ చేయాలి. ఆ తర్వాత ఆర్డర్ పూర్తి చేశాక మొబైల్‌కు సంబంధిత స్టోర్ వివరాలు వాట్సాప్ నంబర్‌కు పంపుతారు. ఆ స్టోర్‌కు వెళ్లి 48 గంటలలోపు వస్తువులను తీసుకోవచ్చు. ఇక నిత్యం సాయంత్రం 5 గంటల లోపు చేసిన ఆర్డర్లకు ఆ తరువాతి 48 గంటల్లోగా డెలివరీ ఉంటుంది. లేదా కస్టమర్లు స్టోర్‌లలోనే తమ సరుకులను పికప్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం పలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే హోం డెలివరీ సేవలను అందిస్తున్నట్లు తెలిపింది.